News
{
}
TV9 Telugu
Language: Telugu
Source: https://tv9telugu.com/feed
-
11/24/2026 8:32:21 PM +05:30ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కుక్కలు చేసే అల్లరి, పిల్లుల విచిత్రమైన చేష్టలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా ఓ ముళ్లపందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అడవులు, పొదలు, బహిరంగ ప్రదేశాల్లో కనిపించే ముళ్లపంది.. ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుస్తూ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-
11/24/2026 8:30:32 PM +05:30భారత SUV మార్కెట్లోకి మరో కొత్త వాహనం రాబోతోంది. JSW గ్రూప్‌కు చెందిన JSW మోటార్స్ తన కొత్త SUV ‘కంబాట్’ (Combat) తొలి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 3, 2026న ఈ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ SUVకి సంబంధించిన స్పై ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఫ్రంట్, రియర్ డిజైన్ వివరాలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి.
-
11/24/2026 8:24:58 PM +05:30Electric Blanket: ఎలక్ట్రిక్ దుప్పటిపై ఏదైనా పడినా లేదా తేమ తగిలినా దానిని ఆన్ చేయవద్దు. నీరు, విద్యుత్ తాకడం వల్ల విద్యుత్ షాక్ లేదా షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. దుప్పటి తడిస్తే, దానిని అన్‌ప్లగ్ చేసి, మళ్లీ ఉపయోగించే ముందు కంపెనీ సూచనలను పాటించండి..
-
11/24/2026 8:20:57 PM +05:30ప్రముఖ కార్ల తయారీ సంస్థ Volkswagen తన కొత్త పర్ఫార్మెన్స్ SUV T-Roc Rను ఆవిష్కరించింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ SUVను రూపొందించింది. ముఖ్యంగా 328hp పవర్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్టాండర్డ్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్, 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఈ SUV వేగం, పనితీరు పరంగా స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.
-
11/24/2026 8:17:16 PM +05:30మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా 2026 నాటికి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాదిలో కఠినమైన క్రాష్ టెస్టులను తట్టుకుని, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ విభాగాలలో 5-స్టార్ రేటింగ్ సాధించిన అత్యంత సురక్షితమైన కార్ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
-
11/24/2026 8:12:17 PM +05:30తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం పాత ప్రదేశంలోనే వెలిగింది. కొండపై దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు. భక్తులు, ప్రతిపక్షాల ఆందోళనలు, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను లెక్కచేయకుండా, శాంతిభద్రతల సాకుతో ప్రభుత్వం నిర్ణయం పై వెనక్కి తగ్గలేదు.
-
11/24/2026 8:11:30 PM +05:30భారత నౌకాదళం మాతంగి పేరుతో 12 స్వదేశీ AI-ఆధారిత డ్రోన్ బోట్లను రంగంలోకి దించింది. ఇవి శత్రువుల కదలికలను నిఘా వేయడమే కాకుండా, 12.7mm గన్‌తో దూకుడు మిషన్లు చేపట్టగలవు. 1500 కి.మీ. పరిధితో, స్వీయ-రక్షణ సామర్థ్యంతో, తీర ప్రాంత భద్రతను, చైనా దూకుడును ఎదుర్కోవడంలో కీలకం కానున్నాయి.
-
11/24/2026 8:10:13 PM +05:30ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad భారత మార్కెట్లోకి సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. BMW R 12 G/S పేరుతో విడుదల చేసిన ఈ ప్రీమియం బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.40 లక్షలుగా నిర్ణయించింది. శక్తివంతమైన 1,170cc బాక్సర్ ఇంజిన్, అధునాతన సస్పెన్షన్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లతో దీన్ని రూపొందించింది. సాధారణ రోడ్లపై ప్రయాణించడంతో పాటు కఠినమైన ఆఫ్‌రోడ్ మార్గాల్లోనూ రైడింగ్ చేయాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బైక్‌ను తీసుకొచ్చింది.
-
11/24/2026 8:00:53 PM +05:30ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Lamborghini మరో అద్భుతమైన సూపర్‌కార్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న తన హైబ్రిడ్ సూపర్‌కార్ Temerarioకి ఓపెన్‌టాప్ వెర్షన్‌గా కొత్త Temerario Spyderను ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు సూపర్‌కార్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అందించారు. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 920hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
-
11/24/2026 7:58:47 PM +05:30Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ 53 బంతుల్లో 204 పరుగులతో చెలరేగాడు. 28 బంతుల్లో సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 28 సిక్సర్లతో పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత్-ఏకు ఏడు వికెట్ల ఘన విజయం అందించాడు.
-
11/24/2026 7:52:11 PM +05:30ఆన్‌లైన్‌లో అక్రమంగా బరువు తగ్గించే ఇంజెక్షన్ల విక్రయాలను టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి భారత్‌కు సరఫరా అవుతున్నట్లు తేలింది. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ ఇంజెక్షన్లను, "పరిశోధనల కోసం మాత్రమే" అనే లేబుల్‌తో విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులపై నిఘా కొనసాగుతోంది.
-
11/24/2026 7:50:59 PM +05:30Jio: మీరు కూడా తరచుగా రీఛార్జ్‌లు చేయడంతో ఇబ్బంది పడుతుంటే, జియో మీ కోసం రూ. 3,999కి ఒక వార్షిక ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత 4G, 5G డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు..
-
11/24/2026 7:50:06 PM +05:30బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.
-
11/24/2026 7:47:20 PM +05:30ఆన్‌లైన్‌లో అక్రమంగా బరువు తగ్గించే ఇంజెక్షన్ల విక్రయాలను టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి భారత్‌కు సరఫరా అవుతున్నట్లు తేలింది. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ ఇంజెక్షన్లను, "పరిశోధనల కోసం మాత్రమే" అనే లేబుల్‌తో విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులపై నిఘా కొనసాగుతోంది.
-
11/24/2026 7:45:53 PM +05:30తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త AICC ఇంచార్జ్ సందీప్ రాకతో జోష్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత కలహాలపై దృష్టి సారించి, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు, నేతల మధ్య సమన్వయం సాధించడంపై ఇంచార్జ్ దృష్టి సారించారు.
-
11/24/2026 7:44:04 PM +05:30సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో కొందరు యువత చేసే ప్రయోగాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. లైకులు, వ్యూస్, కామెంట్ల కోసం వింతవింత వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావాలనే తపనతో ప్రమాదకరమైన స్టంట్లు, భయంకరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
-
11/24/2026 7:39:34 PM +05:30ఒకవైపు ఇంజినీరింగ్ క్లాసులు, పరీక్షల హడావుడి.. మరోవైపు దేశ రక్షణ రంగానికి అండగా నిలిచే అద్భుత ఆవిష్కరణ.. హైదరాబాద్ బిట్స్ పిలానీలో చదువుతున్న నలుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులు క్రాత్‌వీల్ పేరుతో డిఫెన్స్ టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సెల్ టవర్లు, శాటిలైట్ సిగ్నల్స్ అస్సలు లేని మారుమూల సరిహద్దుల్లోనూ సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా టరికొత్త పరికరాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
-
11/24/2026 7:20:33 PM +05:30Vaibhav Sooryavanshi: యూఏఈ-ఏపై 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబుల్ సెంచరీ సాధించినా సంబరాలు చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని అంగీకరించిన ఈ 15 ఏళ్ల ఆటగాడు, సెమీఫైనల్‌తో పాటు ఫైనల్‌లోనూ ఇదే ఫామ్ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
-
11/24/2026 7:19:57 PM +05:30సాధారణంగా ఆదాయం సంపాదించే ప్రతి ఒక్కరికీ ఆదాయపు పన్ను విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిర్దిష్ట రకాల ఆదాయాలకు పూర్తిగా లేదా కొంతమేర పన్ను మినహాయింపు లభిస్తుందని స్పస్టం చేస్తున్నారు. సదరు విషయాలపై అవగాహన ఉంటే చట్టబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. పన్ను మినహాయింపు పొందే పలు ఆదాయ వనరుల గురించి మీకోసం ప్రత్యేకంగా..
-
11/24/2026 7:16:10 PM +05:30టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన అత్తగారైన సుమతి కౌశల్ దగ్గర టాలీవుడ్ హీరో డాన్స్ నేర్చుకున్నారని వెల్లడించారు. అలాగే, స్వర్ణ కమలం సినిమాకు వెంకటేష్ తన నటనను ఎంతగానో ప్రశంసించారని ఆమె గుర్తుచేసుకున్నారు. కెరీర్‌లో పొందే ప్రశంసల విలువ, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేయడంపై భానుప్రియ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
-
11/24/2026 7:14:01 PM +05:30రిటైర్మెంట్ తర్వాత చేతికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వస్తే అంతకంటే భరోసా ఏముంటుంది..? షేర్ మార్కెట్ రిస్క్ లేకుండా, బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ అందించే ఒక అద్భుతమైన ప్రభుత్వ పథకం పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. నెలకు ఏకంగా రూ.20,500 వరకు వడ్డీ ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
-
11/24/2026 7:12:43 PM +05:30తమిళనాడులోని మదురై జిల్లాలో ఉన్న తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం (నవంబర్ 24) తెరపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర అనుమతి నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం ఆలయ అధికారులచే అనుమతించడంతో కొద్దిమంది అర్చకులు కొండపైకి చేరుకుని కార్తీక దీపాన్ని వెలిగించారు.
-
11/24/2026 7:04:57 PM +05:30మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా మెత్తగా ఉడికిపోవడం, లేదంటే ఎక్కువ అన్నం వండేయడం.. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అన్నాన్ని పడేయకుండా, పప్పు నానబెట్టే పని, పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నంతో మంచి దోశలు వేసుకోవచ్చు.
-
11/24/2026 6:52:54 PM +05:30టాలీవుడ్ నటుడు అక్కినేణి నాగేశ్వరరావుకు విజయవంతమైన పునరాగమనం అందించిన ఒక కీలక సినిమా. దుక్కిపాటి మధుసూదనరావు సారథ్యంలో అన్నపూర్ణ పిక్చర్స్ తొమ్మిదవ నిర్మాణంగా రూపొందిన ఈ సినిమా, అనేక ఆసక్తికర సంఘటనలు, నూతన పరిచయాలతో నిండి ఉంది. ఏఎన్నార్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
-
11/24/2026 6:51:29 PM +05:30Personal Finance: పింఛనుదారుడు చాలా కాలంగా తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే, పింఛనును పునఃప్రారంభించడానికి అదనపు ధృవీకరణ లేదా ఆమోదం అవసరం కావచ్చు. జీవిత ధృవీకరణ పత్రాన్ని ఆలస్యంగా సమర్పించినందుకు జరిమానా ఉంటుందా? జీవిత ధృవీకరణ పత్రం సమర్పించినందుకు ప్రత్యేక జరిమానా ఏమీ లేదు.
-
11/24/2026 6:50:39 PM +05:30మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో పలావ్ చేసి తింటారు. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, రుచికి మాత్రమే కాకుండా బలం కూడా. మీరు ఈ రెసిపీని ఒక్కసారి తింటే రుచి అదిరిపోద్ది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
-
11/24/2026 6:50:05 PM +05:30బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఒక హృదయాన్ని హత్తుకునే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్విమ్మింగ్ పూల్‌లో పడి మునిగిపోతున్న రెండేళ్ల చిన్నారిని కేవలం మూడు నెలల వయసున్న పెంపుడు కుక్కపిల్ల కాపాడింది. చిన్నారి ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గుర్తించిన ఆ కుక్కపిల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొలనులోకి దూకి, ఆమెకు అండగా నిలిచింది.
-
11/24/2026 6:45:41 PM +05:30కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుమల యాత్రలో అనుకోని ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయే ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తిరుమలకు వచ్చి సహజ మరణం పొందిన 7మంది భక్తులకు చెందిన కుటుంబ సభ్యులకు టీటీడీ బీమా పరిహారం అందజేసింది.
-
11/24/2026 6:44:14 PM +05:30కష్టసుఖాల్లో తోడుండాల్సిన ప్రాణస్నేహితుడే కాలయముడిగా మారాడు. చిన్నపాటి మనస్పర్థలు, ఫోన్ వాగ్వాదాలతో మిత్రుడనే కనికరం కూడా లేకుండా నడిరోడ్డుపై కత్తులతో వేటాడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది? సాక్ష్యాలు మాయం చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు గంటల్లోనే ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం..
-
11/24/2026 6:39:28 PM +05:30కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇప్పుడు దాదాపు ఇదే టీమ్ తో మరో సినిమా చేస్తోందీ ముద్దుగుమ్మ. అదే పాకెట్ రాకెట్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది.