చంటబ్బాయి chantabbayi
నింగిలేని తారకా నీవెక్కడా నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా ..
తేలుపరాదటే ఓ ప్రియ భామా
చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ
జాణవున్న తావునే జాజిమల్లి తావులు ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా !
ఉత్తరాన లేవంది ||
ఈ నిశీధి వీధిలో బాటసారినై ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై
నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో.. నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో
వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా !
ఉత్తరాన లేవంది ||