శివరంజని sivaranjani
కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమి రేయి
నవమినాటి ||
నీ వయసే వసంత ఋతువై నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవిగా నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయకలో
నవమినాటి ||
నీ ఒడిలో వలపును నేనై నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా అందించే నా పార్వతిగా
మనమొకటై రస జగమేలే సరస మధుర సంగమ గీతికలో
నవమినాటి ||