మాతృదేవో భావ mathrudevobhava

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి 2
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను ||

ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను ||

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి...

వేణువై వచ్చాను ||