నారాయణ శతకము
1. శ్రీ రమా హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా కారుణ్య రత్నాకరా - నీవె గతి కావవే నారాయణా || []
2. పాప కర్మములఁ జేసి - నరక కూపములఁ బడజాల నిఁకను నీపాద భక్తి యొసఁగి - యొక్క దరిఁ జూపవే నారాయణా || []
3. దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర, నా నేరములఁ దలఁపక - దయ చేసి నన్నేలు నారాయణా || []
4. ఆన యించుక లేకను - దుర్భాష లాడు నాజిహ్వ యందు, నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా || []
5. ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెనుఅకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || []
6. వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీఁదుచుమీ గుణము నొక వేళను - దలఁపగదె మేలనుచు నారాయణా || []
7. లోక వార్తలకు మరఁగి - కర్ణముల మీకథల విన నేరను, ఏ కరణీ భవ జలధిఁ - దుదముట్ట నీఁదెదను నారాయణా || []
8. ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను, కలఁతఁ జెందెడు చిత్తమున్ - స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా || []
9. యెంత పాపాత్ముఁడైన - మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ, బుడమి నింత పరుసము సోఁకిన - లోహంబు హేమమౌ నారాయణా || []
10. కామాంధకారమునను - బెక్కు దుష్కర్మములఁ జేసి నేను, నీ మఱుఁగు జొచ్చినాను - నామీఁద నెనెరుంచు నారాయణా || []
11. సమయమైనపుడు మిమ్ముఁ - దలచుటకు శక్తి గలుగునొ కలుగదో, సమయమని తలఁతునిపుడు - నా హృదయ కమలమున నారాయణా || []
12. ఆటలన్నియు ఱంకులు - నేనాడు మాటలన్నియు బొంకులు, పాటింప నింతకైన - నున్నదే పాపంబు నారాయణా || [] 13. వావి దప్పిన వాఁడను - దుష్క్రియా వర్తనుఁడ నగుదు నేను, బావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా || []
14. దేహమే దృఢమనుచును - దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును, సాహసంబున జేసితిఁ - నేగురు ద్రోహంబు నారాయణా || []
15. ఎన్ని జన్మము లాయెనో - నేటి కెందెందు జన్మించినానో నన్ను దరిఁ జేర్పఁ గదవొ - యిఁకనైన నా తండ్రి నారాయణా || []
16. యమ కింకరులఁ దలఁచిన - నాగుండె యావులింపుచు నున్నది యముని బాధలు మాన్పను - మాయప్ప వైద్యుఁడవు నారాయణా || []
17. అరయఁ గామ క్రోధముల్ - లోభంబు మోహమద మత్సరములు, తఱుఁగ వెప్పుడు మనసున - నిన్నెపుడుఁ దలచెదను || []
18. ఆశా పిశాచి పట్టి, - వైరాగ్య వాసనలఁ జేరనీయదు గాసి పెట్టుచు నున్నది - నేనేమి చేయుదును నారాయణా || []
19. తాపత్రయంబుఁ జెంది - చాలఁ బరితాప మొందెడు చిత్తము నీ పాదములఁ జెందినఁ - జల్లనై నిలిచెదను నారాయణా || []
20. చింతా పరంపరలచేఁ - చిత్తంబు చీఁకాకు పడుచున్నది, సంతోషమునఁ గూర్పవె - దివ్య ప్రసాదములు నారాయణా || []
21. ప్రాయమెల్లను బోయెను - నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి మాయా ప్రపంచమేల - చేసెదవి మాయయ్య నారాయణా || []
22. శరణుఁ జొచ్చినవాఁడను - నేఁ జేయుదురితముల నపహరించి పరమ పద మొసఁగఁ గదవె – యిఁకనైనఁ బరమాత్మ నారాయణా || []
23. సంకల్పములు పుట్టినఁ - గర్మ వాసనల దృఢముగఁ జేయవు సంకటము నొందించకే – నను సత్య సంకల్ప నారాయణా || []
24. ఒకవేళ నున్న బుద్ధి - యొక వేళ నుండదిఁక నేమి సేతు విశదంబుగాఁ జేయవే - నీవు నా చిత్తమున నారాయణా || []
25. నెట్టుకొని సకల జీవ - కోటులను గొట్టి భక్షించినాను పొట్ట కొఱకై నీచుల - సేవించి రట్టయితి నారాయణా || []
26. నేను పుట్టినది మొదలు - ఆహార నిద్రలనె జనె కాలము పూని యెప్పుడు సేయుదు - నీపదధ్యానంబు నారాయణా || []
27. ప్రొద్దు వోవక యున్నను - వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని బుద్ధిమాలిన చిత్తము - నీయందుఁ బొందదే నారాయణా || []
28. ఎన్ని విధములఁ జూచిన - నిత్యమును హృదయమున మిము మఱవక యున్నంతకన్న సుఖము - వేఱొక్కటున్నదే నారాయణా || []
29. లాభ లోభముల విడిచి - యిహపరంబులను ఫల మాసింపక నీ భక్తులైన వారు - ధన్యులై నెగడెదరు నారాయణా || []
30. ముందు నీ సృష్టి లేక - సచ్చిదానంద స్వరూపంబును బొంది భేదము నొందక - బ్రహ్మమై యుందువఁట నారాయణా || []
31. కాలత్రయీ బాధ్యమై - మఱి నిరాకారమై యుండు కతనఁ జాలఁగాఁ దత్త్వజ్ఞులు - తెలియుదురు సత్తగుట నారాయణా || []
32. జ్ఞాన స్వరూపమునను - నజడమై జడ పదార్థము నెల్లను గానఁగాఁ జేయు కతనఁ - జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || []
33. సుఖ దుఃఖముల రెంటికి - వేఱగుచు సుఖ రూపమైన కతన నఖిల వేదాంత విదులు - ఆనందమండ్రు నిను నారాయణా || []
34. గుణ మొకటియైన లేని - నీయందు గుణమయంబైన మాయగణుతింపఁ గను పట్టెడు - దర్పణము కైవడిని నారాయణా || []
35. అందుఁ బ్రతిబింబించిన - చిత్సదానంద సముదాయమెల్లఁ జెందు నీశ్వర భావము - త్రిగుణ సం శ్లిష్టమయి నారాయణా ||[]
36. సత్వంబు రజము తమము - నను మూఁడు సంజ్ఞలను గ్రమము తోడఁ దత్త్వజ్ఞులేర్పరింపఁ - సద్గుణ త్రయములను నారాయణా || []
37. ప్రకృతి నీయందు లీనమై - యుండి స్మృతిని జెందిన వేళను సకల ప్రపంచ మిటులఁ - గనుపట్టె నకళంక నారాయణా || []
38. మీరు సంకల్పించిన - యిష్టప్రకారమును జెందు మాయ యారూఢి వివరించెద - నవ్విధం బొప్పంగ నారాయణా || []
39. పంచభూతములు మనసు - బుద్ధియును బ్రకటహంకారములును, నెంచంగ నిట్టిమాయ - యిదిగా ప్రపంచంబు నారాయణా || []
40. భూతపంచక తత్త్వ సం - ఘాతమునఁ బుట్టె నంతఃకరణము ఖ్యాతిగా నందుఁ దోఁచి - చిత్తు జీవాత్మాయె నారాయణా || []
41. వెస మనో బుద్ధి చిత్తా - హంకార వృత్తు లంతఃకరణము ప్రచురింప నవి నాలుగు - తత్త్వ రూపములాయె నారాయణా || []
42. భౌతిక రజోగుణములును - నేకమై ప్రాణంబు పుట్టించెను వాద భేదములచేతఁ - బంచ పాపములాయె నారాయణా || []
43. అలరు ప్రాణ మపానము - వ్యానంబుదానము సమానంబులు తలఁప నీ సంజ్ఞలమరి - వాయుతత్త్వము లొప్పు నారాయణా || []
44. ప్రత్యేక భూత సత్త్వగుణములన - బరఁగి బుద్ధీంద్రియములు సత్త్వమున జనియించెను - దత్త్వ ప్రపంచముగ నారాయణా || []
45. చెవులు చర్మముఁ గన్నులు - జిహ్వ నాసికయుఁ బేరుల చేతను దగిలి బుద్ధీంద్రియముల - విషయ సంతతిఁ దెలియు నారాయణా || []
46. భౌతిక తమోగుణమున - విషయములు తఱుచుగాఁ జనియించెను, శబ్ద స్పర్శ రూప - రస గంధ నామములు నారాయణా || []
47. తాదృశ రజోగుణమున - జనియించె నరక కర్మేంద్రియములు ఐదు తత్త్వమ్ము లగుచును - గర్మ నిష్ఠాదులకు నారాయణా || []
48. వాక్పాణిపాదపాయూ - పస్థలను వాని పేళ్ళమరుచుండుఁబ్క్వ హృదయులకుఁ దెలియు - నీవిధము పరమాత్మ నారాయణా || []
49. పలుకు పనులును నడుపును - మలమూత్రములు విడుచుటీ య యిదును వెలయఁ గర్మేంద్రియముల - విషయములు నళినాక్ష నారాయణా || []
50. పరఁగఁ జంద్రుండు బ్రహ్మ - క్షేత్రజ్ఞుఁ డరువొందు రుద్రుఁడచటి, పరమానసాదులకును - నధిపతులు వివరింప నారాయణా || []
51. అరయ దిక్కున వాయువు – సూర్యుఁడును, వరుణుండు, నశ్వినులును, బరఁగ శ్రోత్రాదులకును – నధిపతులు పరికింప నారాయణా || []
52. అనలుఁ, డింద్రుఁడు, విష్ణువు – మృత్యువును, నల ప్రజాపతియుఁగూడి, యొనరఁగా నాడులకును – నధిపతులు పరికింప నారాయణా || []
53. పంచీకృతంబాయెను – భూతపంచకము, ప్రబలించి సృష్టి పంచీకృతముచేతను స్థూల రూపము లాయె నారాయణా || []
54. పది యింద్రియముల మనసు – బుద్ధియును, బ్రాణంబులైదుగూడి, పదియేడు తత్త్వములను – సూక్ష్మరూపములాయె నారాయణా || []
55. స్థూలసూక్ష్మములు రెండు – కలుగుటకు మూలమగు నజ్ఞానము, లీల కారణ మాయెను – జీవులకు నాలోన నారాయణా || []
56. ఈరెండు దేహములకు – విశ్వంబు నెల్లఁ బ్రకటనంబాయెను నామ రూపముల చేత – లోకైక నాయకుఁడ నారాయణా || []
57. కొన్ని మాయనుఁ బుట్టును – గ్రుడ్లతోఁ గొన్ని తనువులు పుట్టును, గొన్ని ధరణిని బుట్టును – జెమటలను గొన్ని హరి నారాయణా || []
58. ఈ చతుర్విధ భూతములందుఁ – గడు హెచ్చు మానవ జన్మము నీచమని చూడరాదు – తథ్యమే నిర్ణయము నారాయణా || []
59. ఈ జన్మమందెకాని – ముక్తి మఱి యేజన్మమందు లేదు చేసేతఁ దను దెలియక – మానవుఁడు చెడిపోవు నారాయణా || []
60. చేతనాచేతనములు – పుట్టుచును రోఁతలకు లోనగుచును నాతంక పడుచుండును – గర్మములఁ జేతఁనుడు నారాయణా || []
61. సకలయోనులఁ బుట్టుచుఁ – బలుమాఱు స్వర్గ నరకములఁ బడుచు, నొకట నూఱట గానక – పరితాప మొందితిని నారాయణా || []
62. వెలయ నెనుబదినాలుగు – లక్ష యోనులయందుఁ బుట్టిగిట్టి యలసి మూర్ఛలఁ జెందుచు – బహుదుఃఖముల చేత నారాయణా || []
63. క్రమముతో మనుజగర్భ – మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగు చును, నమితముగ నచ్చోటను – గర్భనరకమునఁ బడు నారాయణా || []
64. ఈశ్వరాజ్ఞను బుట్టిన – తెలివిచే హృదయమునఁ దలపోయుచు విశ్వమునఁ దను బొందిన – పాటెల్ల వేర్వేఱు నారాయణా || []
65. చాలు చీ! యిక జన్మము – నిఁకఁ బుట్టుఁ జాలు, శ్రీహరి భజించి మేలు చెందెద ననుచును – జింతించు నాలోన నారాయణా || []
66. ప్రసవకాలమునఁ దల్లి – గర్భమునఁ బాదుకొని నిలువలేక వసుధపయి నూడిపడినఁ – దెలివిచే వాపోవు నారాయణా || []
67. చనుఁబాలు గుడిచి ప్రాణ – ధారణను నిఁక మూత్ర మలములోను, మునిఁగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా || []
68. బాలత్వమున బిత్తరై – నలుగడలఁ బాఱాడు సిగ్గులేక పాలుపడి యౌవనమునఁ – విషయానుభవమొందు నారాయణా || []
69. ముదిమి వచ్చిన వెనుకను – సంసారమోహంబు మానకుండఁ దుదనేఁగుఁ గర్మగతులఁ – బొందుటకు ముదమేమి నారాయణా || []
70. అజ్ఞాన లక్షణమ్ము – లిటువంటివని విచారించి నరుఁడు సుజ్ఞానమునకుఁ -దగిన మార్గంబు చూడవలె నారాయణా || []
71. వేదాంత వేదియైన సద్గురుని పాదపద్మములు చెంది యాదయానిధి కరుణచే – సద్బోధ మందవలె నారాయణా || []
72. ఏ విద్యకైన గురువు – లేకున్న నావిద్య పట్టుపడదు కావునను నభ్యాసము – గురుశిక్ష కావలెను నారాయణా || []
73. గురుముఖంబైన విద్య – నెన్నికై కొనిన భావజ్ఞానము చిరతరాధ్యాత్మ విద్య – నభ్యసింపఁగ లేడు నారాయణా || []
74. అనపేక్షకుఁడు సదయుఁడు – వేదాంతనిపుణుఁడయ్యాచార్యుడు దొరుకుటపురూపమపుడు – గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || []
75. అట్టిసద్గురుని వెదకి – దర్శించి యా మహాత్ముని పదములు పట్టి కృతకృత్యుఁడౌను – సాధకుఁడు గట్టిగా నారాయణా || []
76. మొగి సాధనములు నాల్గు – గలనరుఁడు ముఖ్యాధికారి యగును దగిన యుపదేశమునకు – యోగసాధకులలో నారాయణా || []
77. ఇది నిత్య మిదియనిత్యం – బనుచుఁ దన మది వివేకించుటొ కటి, యెదను నిహపర సుఖములు – కోరనిది యిదియొకటి || []
78. ముదముతో శమదమాది – షట్క సంపద గలిగి యుండుటొ కటి, విదితముగ ముక్తిఁ బొందఁ – గాంక్షించు టదియొకటి || []
79. ఈనాల్గు సాధనముల – నధికారియై నిజాచార్యుఁ జేరి నానా ప్రకారములను – శుశ్రూష నడుపవలె నారాయణా || []
80. ఉల్లమునఁ గాపట్యము – లవ మైన నుండ నీయక సతతము తల్లి దండ్రియుఁ దైవము – గురువనుచుఁ దలఁపవలె నారాయణా || []
81. తనువు, ధనమును, సంపద – గురుని సొమ్మని సమర్పణము చేసి, వెలసి తత్పరతంత్రుఁడై – నిత్యమును మెలఁగవలె నారాయణా || []
82. ఏనిష్ఠ గురునిష్ఠకు – దీటుగాదీ ప్రపంచంబునందు మానసము దృఢము చేసి – యలరవలె మౌనియై నారాయణా || []
83. ఇట్టి శిష్యుని పాత్రత – వీక్షించి హృదయమునఁ గారుణ్యము నెట్టుకొని బ్రహ్మవిద్య – గురుఁడొసఁగు నెయ్యముగ నారాయణా || []
84. బ్రహ్మంబు గలుఁగఁగానె – యేతత్ప్రపంచంబు గలిగి యుండు బ్రహ్మంబు లేకున్నను – లేదీ ప్రపంచంబు నారాయణా || []
85. ఈ విధంబున సూక్తుల – బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి భావ గోచరము చేయుఁ – జిత్స్వరూపములెల్ల నారాయణా || []
86. ఆ బ్రహ్మమందె పుట్టు – విశ్వంబు నాబ్రహ్మమందె యుండు నా బ్రహ్మమందె యణఁగు – నదె చూడు మని చూపు నారాయణా || []
87. అది సచ్చిదానందము – అది శుద్ధ మది బద్ధ మది యుక్తము అది సత్య మది నిత్యము – అది విమలమని తెలుపు నారాయణా || []
88. అదె బ్రహ్మ మదె విష్ణువు – అదె రుద్రుఁ డదియె సర్వేశ్వరుండు అది పరంజ్యోతి యనుచు – బోధించు విదితముగ నారాయణా || []
89. భావింప వశముగాదు – ఇట్టిదని పలుక శక్యంబుగాదు భావంబు నిలుపుచోట – నసి తాను బరమౌను నారాయణా || []
90. అది మాయతోఁ గూడఁగ – శివుఁడాయె, నదియె విద్యను గూ డఁగ విదితముగా జీవుఁడాయె – నని తెలుపు వేర్వేఱ నారాయణా || []
91. శివుఁడు కారణ శరీరి – కార్యంబు జీవుఁడా లక్షణములు ద్వివిధముగఁ దెలియు ననుచు – బోధించు వివరముగ నారాయణా || []
92. అరయ నిరువది నాలుగు – తత్త్వంబులై యుండు నందమ గుచుఁ గరతలామలకముగను – బోధించుఁ బ్రకటముగ నారాయణా || []
93. కారణము కార్యమగుచు – వ్యవహార కారణాఖ్యత నుండును నారూఢి బ్రహ్మాండము – పిండాండ మని తెలుపు నారాయణా || []
94. ఐదు భూతములు, నింద్రి- యములు పది, యంతరంగములు నాల్గు, ఐదు విషయములు తత్త్వ – సంఘాతమని తెలుపు నారాయణా || []
95. స్థూల సూక్ష్మాకృతులును – గారణముతో మూడు తెఱఁగులకు ను, నీలమగు నందు నమరు – నని తెలుపు లాలించి నారాయణా || []
96. వెలసి పంచీకృతములు – నగు భూతములకుఁ బుట్టినది తను వు, స్థూలంబు నది యనుచును – బోధించు దయతోడ నారాయణా || []
97. ఐదు నయిదింద్రియములు – ప్రాణంబు లయిదు, మనసును బు ద్ధియుఁ, బాదుకొని సూక్ష్మ మందు – బోధించుఁ బ్రకటముగ నారాయణా || []
98. గాఢమగు నజ్ఞానము – ఈరీతిఁ గారణ శరీర మగును మూఢులకు వశముగాదు – తెలియ విను మోదమున నారాయణా || []
99. ఈమూఁడు తనువులందు – దా నుండి ఈతనువు తాననుచును వ్యామోహ పడుచుండు(ను) – జీవుండు వరుసతో నారాయణా || []
100. కలలేక నిద్రించును – కలఁగాంచి కడు మేలుగోరు చుండును గలకాల మీ జీవుఁడు – త్రివిధములఁ గలసియును నారాయణా || []
101. ప్రాజ్ఞతైజస విశ్వులు – తానె, ఈపర్యాయముగ జీవుఁడు ప్రజ్ఞగోల్పడ పొందును – సంసార బంధంబు నారాయణా || []
102. మూఁడవస్థలకు సాక్షి – యైనట్టి మూలంబు తాఁ దెలిసినఁ జూడుమని సన్మార్గము – తేటగాఁ జూపుచును నారాయణా || []
103. నీవు దేహంబు గావు – ప్రాణంబు నీవుగావింద్రియములు నీవుగాదని తెలుపును – వేదాంత నిలయమున నారాయణా || []
104. అనల తప్తంబు గాదు – జలమునను మునిఁగి తడిఁ జెందఁబో దు, అనిలశుల్కంబుగాదు – నిరుపమం బని తెలుపు నారాయణా || []
105. కామహంకార మిపుడు – చిత్తంబుగా వీవు బుద్ధి నీవు కావు మనసులు సత్యము – సాక్షివగు గట్టిగా నారాయణా || []
106. దేహధర్మములు నీకుఁ – దోఁచు టంతేగాని నిత్యముగను మోహంబు మానుమనుచు – బోధించు ముఖ్యముగ నారాయణా || []
107. ఎన్ని దేహములు చెడిన – నీవు నేక స్వరూపుండ వగుచు జెన్నలరి యుందు విలను – దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా || []
108. అన్ని వేదాంత వాక్య – ములలో మహావాక్యములు నాలుగు నిన్ను నీశ్వరునిగాను – వర్ణించు నిక్కముగ నారాయణా || []
109. ఉభయ దృశ్యోపాధులు, కడఁద్రోసిపోక యయ్యాత్మ మిగుల నభయముగ నిటులెప్పుడు – చింతింపు మని తెలుపు నారాయణా || []
110. జీవ శివ తారతంయ – మున నైక్య సిద్ధి కానేర దనుచు భావ సంశయము దీర్పు – కార్యార్థ పటిమచే నారాయణా || []
111. నిర్వికారుఁడవు నీవు – నీ యందె నిజమైన చందమునను బర్వుఁ బ్రకృతి వికారము – లని తెలుపు ప్రౌఢిచే నారాయణా || []
112. సద్గురుం డీరీతిగా – బోధించు సరళితో వాక్యార్థము హృద్గతముఁ జేసియుండి – జగతి జీవింపుదును నారాయణా || []
113. అని చింతనము జేయుచుఁ – జిత్తమునఁ దనివిఁ జెందుచు నెప్పు డు, కనుదమ్ములను ముడుచుచు – ధ్యానంబుగాఁ జేయు నారాయణా || []
114. అపగతాఘ కృత్యుఁడై – ఈరీతి నభ్యాస మొనరించుచు నపరోక్ష సిద్ధి నొందు – బ్రహ్మంబు తానగుచు నారాయణా || []
115. కందళిత హృదయుఁడగుచు – సచ్చిదానంద స్వరూపుఁడగు చు, సందర్శితాత్ముఁడగుచు – నుండు నవికారతను నారాయణా || []
116. అవ్యయానంద పూజ్య – రాజ్య సింహాసనాసీనుఁడగుచు భవ్యాత్ముఁడై వెలసెను – బూజ్య సంభావ్యుఁడై నారాయణా || []
117. నీవు సకలంబుగాని – యున్నదే నీకన్న వేఱొక్కటి జీవుఁడని వర్ణించుట – వ్యవహార సిద్ధికిని నారాయణా || []
118. చిలుక పలుకులు పలికితి – నాకేమి తెలియుఁ దత్త్వ రహస్య ము, వలదు నను నేరమెంచ – సాధులకు నళినాక్ష నారాయణా || []
119. శరణు భక్తార్తిహారి – గురురూప శరణు సజ్జన రక్షక శరణు దురితౌఘనాశ – శరణిపుడు కరుణించు నారాయణా ||