ఎదుట నిలిచింది చూడు

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో...
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో..
మైమరచిపోయా ...మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వాన వీణలా ...

నిన్నే చేరుకోలేక ... ఎటెల్లిందో నా లేఖ,
వినే వారు లేక ... విసుక్కుంది నా కేక ,
నీదో ... కాదో రాసున్న చిరునామా
వుందో ... లేదో ఆ చోట నా ప్రేమ ,
వరంలాంటి శాపమేదో ... సొంతమైదిలా ...

నిజంలాంటి యీ స్వప్నం ...యెలా పట్టి ఆపాలి ?
కలే అయితే ఆ నిజం ...ఎలా తట్టుకోవాలి ?
అవునో... కాదో అడగకంది నా మౌనం ,
చెలివో... శిలవో తెలియకుంది నీ రూపం ,
చెలిమి బంధ మల్లుకుందే జన్మ ఖైదిలా ...