Musings
Public · Protected · Private
చూపే బంగారమాయనే శ్రీవల్లి
-
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ ముందుండే నేను నీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ
This blog is frozen. No new comments or edits allowed.