Public · Protected · Private
సీతారాములు seetharamulu
Type: Public  |  Created: 2008-02-17  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో

    తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం

    యెగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంధ్య వేళలో||

    జీవితమే రంగుల వలయం

    దానికి ఆరంభం సూర్యుని ఉదయం

    గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం

    వెదికే ప్రతి ఉదయం దొరికే నొక హృదయం

    ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

    తొలిసంధ్య వేళలో||

    సాగరమే పొంగుల నిలయం

    దానికి ఆలయం సంధ్యా సమయం

    వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం

    లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం

    ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

    తొలిసంధ్య వేళలో ||

    2008-02-17 16:42
This blog is frozen. No new comments or edits allowed.