Musings
Public · Protected · Private
రంగుల రాట్నం - rangula raatnam
-
2009-01-31 21:58నడి రేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా ఏడేడు శిఖరాల నే నడువలేను ఏ పాటి కానుకలందించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను అమ్మా... ఆ... మముగన్న మాయమ్మ అలివేలు మంగ ఆ.. మముగన్న మాయమ్మ అలివేలు మంగ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా కన్నీట బ్రతుకున కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా అడగవె మా తల్లి అనురాగవల్లి అడగవె మాయమ్మ అలివేలు మంగ
This blog is frozen. No new comments or edits allowed.