Musings
Public · Protected · Private
రాక్షసుడు rakshasudu
-
2009-11-25 09:42జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ సుస్యామల సశ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా జయ|| జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ||
This blog is frozen. No new comments or edits allowed.