Public · Protected · Private
భాస్కర శతకము
Type: Public  |  Created: 2008-01-09  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఇది తెలుగు నీతీ శతకాలలో ఒకటి. దీనిని వ్రాసిన వారు మారవి వెంకయ్య కవి (క్రీ.శ. 1550 – 1650).

    అతడు సూర్య భగవానుని భక్తుడు.

    శ్రీకాకుళం-విజయనగరం దగ్గర నివసించిన ఈ కళింగ కవి, అరసవిల్లి (శ్రీకాకుళం నుండి ౩ కిII దూరం) సూర్యుని పేరు మీదగా ఈ శతక పద్యాలు రాయటం జరిగింది.

    2012-03-30 19:43
  • శ్రీగల భాగ్యశాలిఁ గడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ రాగమన ప్రయాసము కాదట నోర్చియైన నిల్వ న ద్యోగము చేసి; రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్ సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

    ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా; చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!

    చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

    2012-03-30 19:46
This blog is frozen. No new comments or edits allowed.