Musings
Public · Protected · Private
నిర్జీవం కానీ.....
-
2012-01-01 00:19ప్రియతమా.. నీ అందమైన తనువును తాకలేని ఈ చేతులు ఎందుకు.. విరిగి మోడులై పోనీ.. నీ కటాక్ష వీక్షణాలు గానలేని ఈ కనులెందుకు.. పేలి కాలి పోనీ.. నీ తీయని పిలుపు వినలేని ఈ చెవులు ఎందుకు.. బిగి గడియలు పడనీ.. నా అనురాగాన్ని తెలుపుకోలేని ఈ నోరు ఎందుకు.. పడి మూగ బోనీ.. నీతో కలసి నడవలేని ఈ పాదాలు ఎందుకు.. కఠిన పాషాణము లై పోనీ.. నీ హృదయాన్ని అందుకోలేని ఈ హృదయం ఎందుకు.. ఫెళ్ళున పగిలి శకలవికలములు కానీ.. నీవు వెదజల్లే అనంత పరిమళాలని ఆస్వాదించలేని ఈ శ్వాస ఎందుకు.. నిశ్చయంగా స్తంభించనీ.. నీ ప్రేమ పొందలేని ఈ జీవం ఎందుకు ప్రియా.. నిర్జీవం కానీ..
This blog is frozen. No new comments or edits allowed.