Public · Protected · Private
ప్రార్ధన...
Type: Public  |  Created: 2012-01-01  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ప్రియతమా.. నువ్వు రాగానే నా ప్రేమనే పరిమళించమని పువ్వులనడిగాను.. నా మనోరధాన్ని చల్లగా తెలుపమని.. చిరుగాలినడిగాను.. నా అనురాగాన్ని తీయగా పాడమని కోయిలనడిగాను.. నా మమతని మత్తుగా వేదజల్లమని వెన్నెలనడిగాను.. నా ఆనందడోలికలని నాట్యంగా తెలుపమని వనమయూరినడిగాను.. నా ప్రేమామృతాన్ని ధారగా వర్షించమని మేఘాలనడిగాను.. నీ రూపాన్నే ప్రతిబింబించమని తార తార నీ అడిగాను.. నీ పేరునే ప్రతిధ్వనించమని కొండకోనలనడిగాను.. నీ అందెల సవ్వడిలా గలగలా జారమని సెలయేరునడిగాను.. అపూర్వ సౌందర్యానికి నిలయమైన నిన్ను.. నాదానిగా చేయమని.. కనపడని ఆ దేవుణ్ణి మరీ మరీ ప్రార్ధిస్తున్నాను ప్రియా... ..
    2012-01-01 00:29
This blog is frozen. No new comments or edits allowed.