దాన వీర శూర కర్ణ daana veera sura karna
ఏమంటి వేమంటివి...
జాతి నెపమున సూత సుతులకింత
నిలువ ఘాత లేదందువా
ఎంత మాట ఎంత మాట...
ఇది క్షాత్ర పరిక్షయే గాని
క్షత్రియ పరీక్ష గాదే…
కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా...
నీ తండ్రి భరద్వాజుని జననము ఎట్టిది...
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది.మట్టి కుండలో పుట్టితివి కదా...నీది ఏ కులము...
ఇంత ఏల అశ్వః పితామహుడు గురుకుల వ్రుద్దుడైన శాంతలవుడు
శివ సముద్రుని భార్య అగు గంగా గర్భమున జనియించలేదా…
ఈయనదే కులము...హహ...
నాచే చెప్పించు వేమయా...మా వంశముకు మూల పురుషుడు ఐన వసిష్ఠుడు
దేవ వేశ్య అగు ఊర్వశికి పుత్రుడు కదా...
అతను పంచమ జాతి కన్య ఐన అరుందతి
అందు శక్తిని ఆ శక్తి చండాలంగను అని పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడుచు ఐన మత్స్య గందమ అందు మా తాత వ్యాసుని...
ఆ వ్యాసుడు విదవరాండ్రు ఐన మా పితామహుని అంబికను మా తండ్రి ని...పినపితామాహుడంబిక తో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసీతో
ధర్మనిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుడిని కనలేదా…హహహా...
సందర్భావసరములను బట్టి క్షాత్రబీజ ప్రాధాన్యములతో సంకరమయిన మా ఈ కురువంశము ఎనాడో కులహీనమైనది
కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదములెందులకు...
నాయనా సుయోధనా
ఏరులా పారులా భ్రహ్మఃర్షుల జననములు మనము విచారించదగినవి కాదు