ఇంద్రధనుసు indra dhanassu
నేనొక ప్రేమ పిపాసిని||
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని ||
తలుపు మూసిన తలవాకిటనే
పగలూ రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే||
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని ||
పూట పూట నీ పూజ కొసమని పూవులు తెచ్చానూ
ప్రేమ బిక్షను పెట్టగలవని దోసిలి వొగ్గానూ
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచానూ
నీవు రాకనే అడుగు పడకనే నలిగి పోయానూ
నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చేబుతున్న నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావూ
నను వలచావని తేలిపేలోగ నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని ||