విచిత్ర సొదరులు vichitra sodarulu
నన్ను తలచి, నవ్వుకున్నా.. చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి ||
ఆ నింగినెన్నటికి ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ....
ఆడుకుంది నాతో.. జాలి లేని దైవం
పొంద లేక నిన్ను.. ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హొరు గాలిలోన వూకనైతి నేనే
గాలి మేడలె కట్టుకొన్న చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకొన్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా.. కల చెదిరేను కాదా అంతే....
కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలి పోయె ఆశ తీరుపూట
కోరుకున్న యోగం, జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలె నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా..
కల చెదిరెను కాదా......... అంతే....