ఆరాధన aradhana
అరె ఏమైందీ....
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ ..
అది ఏమైందీ..
తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ ..
కలగాని.. కలయేదో.. కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది ...
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం...పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ
పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు
నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావా
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ...
అరె ఏమైందీ||
బీడు లోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది
పాడ లేని గొంతులోన పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు..
మనిషౌతాడు ....
అరె ఏమైందీ||