నీ స్నేహం nee sneham

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా...
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా||

సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడొ ఏమొ బ్రహ్మా
పచ్చనైన వరి చేల సంపదలు
అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ ...
లేత అడుగు తన యదను మీటి ...
నేలమ్మ పొంగెనమ్మా...
ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా


సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్ని నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీ హరిగ మారునని రాసిపెట్టి
యే వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శౄంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
ఆ రాముని సుమ శరమా -2