మహర్షి maharshi


సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రదం
సాగితే ఆపడం సాధ్యమా


నిశ్చయం, నిశ్చలం. హహహా.
నిర్భయం నా హయం

కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చేయను.
కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఉరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంట
నే మనస్సు పడితే ఏ కలలైనా
ఈ చిటికకోడుతు నే పిలువనా

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా

అదరని బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహార్షి

వేడితేనేని ఓడిచేరుతందా వేటసాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం కాలరాసేసి పోదా
అంతమో సోంతమో పంతమే వీడను.
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఓళ్ళోతూలిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా

తకిటజం తరితజం తనతజం జమ్తజం తకిటజం తరితజం జమ్తజం
ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ
తన నాననాన తన నాననాన
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భనోదయాన చంద్రోదయాలు

సుమం

హహా ఆ అహహహహా ఆ ఆ ఆ
వేణువ వీణియ ఏవిటీ రాగము
వేణువ వీణియ ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బ్రుదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రగోల సాలు
ఈ వేళ నాలో రగోల సాలు
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హ్రుదయం
భానోదయాన చంద్రోదయాలు

సుమం

తరర తారర తారర ఆ
రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేది నాలోన లేదు
ఆవేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హ్రుదయం
భనోదయాన చంద్రోదయాలు
సాహసం నా పదం రాజసం నా రధం
song available above
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల

అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారతీరం అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
కూడనిదీ జత కూడనిదీ
చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
చాలా బాగుంది बहुत्