ఆదిత్య 369

రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయ నేలా
రాసలీల||

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవి చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలి
తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
రాసలీల||

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు
రాసలీల||