హృదయాంజలి hrudayanjali

మానస వీణ మౌన స్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలిభూపాలం
పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మైనీలా జోకొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం


పున్నమినదిలో విహరించాలి పువ్వులఒళ్లో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరిజల్లై దిగిరావాలి
తారలపొదరింట రాతిరిమజిలీ వేకువవెనువెంట నేలకుతరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి

మానసవీణ మౌనస్వరాన ఝుమ్మనిపాడే తొలిభూపాలం

వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం
వాగునా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం "

ఊహకునీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి
కలలకుసైతం సంకెలవేసే కలిమిఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడుఊసులు తీసుకువెళ్లి
పేదగరికపూలకు ఇస్తా నా హృదయాంజలి