సంతానం samthanam

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో 2
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో ||

తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో ....
చల్లని వెన్నెలలో ||

కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ...
కలకాలం నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో ....
చల్లని వెన్నెలలో ||