గుప్పెడు మనసు guppedu manasulu

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే