దూరం..కాకు..
కమలానికి సూర్యుడు
కలువకి చంద్రుడు
నింగికి నేల
దూరమైతే..అయిపోనీ..
కడలికి తీరం
గిరులకి మేఘం
నదికి సాగరం
దూరమైతే..అయిపోనీ..
అవనికి వసంతం
పగలుకి రేయి
కాలానికి గమ్యం
దూరమైతే..అయిపోనీ..
పూలకి పరిమళం
దివ్వెకు తేజం
హిమానికి చల్లదనం
దూరమైతే..అయిపోనీ..
కానీ..ప్రియా..
నువ్వు మాత్రం
ఎన్నటికీ..నాకు దూరం కాకు..
అదే నా కోరిక...