గుడ్ ఫ్రైడే అంటే .....
ఇది క్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను నేమరవేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజు కావడం గమనార్హం.
దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.
ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు.
ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు.
దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.
కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.
క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.