చంటి chanti

పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం

పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
పావురానికి పంజెరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
కోడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఊ

పావురానికి

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో వీతంత తెలిపి పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపముల ఇవి ఆ విధి శాసములా
మారని జతకమా ఇది దెవుని శాసనమా
ఇది తీరేదే కాదా

పావురానికి

తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘొరం నామీద నాకేలే కోపం
నా తోలి నేరమున ఇవి తీరని వెదనలా
నా మది లోపముల ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాదే పోదా

పావురానికి
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమివే గంగలలో తేనెలతో కడిగిన ముత్యమువే
ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోయె చంటి పాడే జోలలోనే
జాబిలికి ||

వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే, హాయి నిద్ర నా పలకే
కూనలమ్మ నా పదమే, తేనె కన్న తీయనిది
కోనలన్ని పాడుకొనే, గువ్వచిన్న పాట ఇది
రాగాలు తాళాలు నాకసలు రావులే
పాడుకును ధ్యానమునే నాకొసగే దైవమే

ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోయె చంటి పాడే జోలలోనే
జాబిలికి ||
అన్నులమిన్నల అమ్మడికన్నులు గుమ్మడిపువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమసుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేణి ఈ రాణి
అన్నులమిన్నల ||

ఆ దేవుడు ఆ దేవితొ అలక పూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో
రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి
నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి
విరబూసే పూబోణి
అన్నులమిన్నల ||

ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవులు వేకువలకు మేలుకొలుపులేమో
పాలకడలి మీద తేలు చంద్రికో గగనాన వేల కాంతులీను తారకో
వెన్నెల్లా వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు
ఊరంత సందళ్ళు ఆనాడు వాడంతా వియ్యాలవారు
అన్నులమిన్నల ||