రుద్రవీణ rudraveena
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా తరలి
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద తరలి
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం
ఏ ప్రయొజనం లేని వ్రుధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద తరలి
కన్నుల కొలనిని ఆ..
ఉదయ రవి కిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ.. ||ఉదయ||
అమృత కలశముగా ప్రతి నిమిషం ||2||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది ||లలిత||
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం ||2||
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చిగురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ చరితలగల మృదు రవళి
తూగుతున్నది మధుర వని
లేత విరి కులుకుల నటన కని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను |లలిత||
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది ||2||
కలసిన మమతల స్వరగతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
రాయమని మాయని మధు కావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనే వడి వడి పరుగిడి ||ఉదయ||
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేకద గుండెబలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆమాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది (4)
గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది (4)
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినానే ఏకాకిని (2)
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది (2)
పాత పాట మారాలని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట (2)
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా యే ముళ్ళ బాట (2)
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది (2)
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన యే రాగం
అది అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్తకోకిల
కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది (2)
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి
జనజీవిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను(2)
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం
యచ్చనైన ఊసులెన్నొ రెచ్చకొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడిపేలేని సీకటే ఉండిపోనీ
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రావఁచిలకా సద్దుకుపోయే సీకటెనకా ?
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఊ ఊ నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు యేనాటికీ ..
పక్కవారి గుండెలనిండా .. చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా .. చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది ..
నమ్మకు నమ్మకు
అరె.. నమ్మకు నమ్మకు
ఆహా .. నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలై ?.నా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఆహా ? నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అహ ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా -2
కళ్ళ ముందు కటిక నిజం కాన లేని గుడ్డి జపం -2
సాధించదు ఈ పరమార్థం బ్రతుకుని కానీయకు వ్యర్థం-2
చుట్టూ పక్కల||
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూsస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే -2
గుండె బండగా మర్చేదా సంప్రదాయం అంటే -2
చుట్టూ పక్కల ||
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా ..
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాట గానే -2
చుట్టూ పక్కల ||
కళ్ళ ముందు కటిక నిజం కాన లేని గుడ్డి జపం -2
సాధించదు ఈ పరమార్థం బ్రతుకుని కానీయకు వ్యర్థం -2
చుట్టూ పక్కల ||
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని .. ఆ (2)
అమృతకలశముగా ప్రతినిమిషం (2)
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
|లలిత|
రేయీ పగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరులవనం మన హృదయం (2)
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి ఈ రాగ చరితరగల మ్రుదురవళీ
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
|లలిత |
కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ (2)
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆ