Musings
Public · Protected · Private
Indhrudu Chandrudu
-
2008-01-20 00:38నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు వినరో పిట పిట లాడే పిట్టల కొక్కొరకో పదరో చిట పత లాదే ఈడుకు దిక్కిదిగో కసిగా కుత కుత ఉడికే కళ్ళకు విందిదిగో ఎదలో కిత కిత పెట్టే కన్నెల చిందిదిగో చెక్కిలి నొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కులురో చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరి బిక్కిరి తప్పదురో అక్కరతీర్చే అంగడిరో అందాల అనదాలు అందాలె పదరా సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో త్వరగా కలబడి ఖానా పీనా కానీరో మరిగే కలతకు జాణల దాణా కానుకరో తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చెల్లదురా మల్లెల గంధం చల్లునురా అల్లరిబంధం అల్లునురా అత్తరు సోకు కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా
-
2008-01-20 00:41లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి తెలుసా ఈ ఊసు చెబుతా కల ఊచు కాపురం చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది అంతలో ఏమైంది అడగవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి మాయనే నమ్మింది బోయతో పోయింది దెయ్యమే పూనిందో రాయిలా మారింది వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు గుండెలో ఇన్నళ్ళు కొండలే మోసారు నేరం నాదైనా భారం మీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిగా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా బుద్దిలో లోపాలే దిద్దుకో నీవమ్మా
-
2008-05-13 10:42లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
-
2008-05-13 10:44నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
This blog is frozen. No new comments or edits allowed.