Musings
Public · Protected · Private
కొమురం భీముడో
-
భీమా నినుగన్న నేల తల్లి ఊపిరిబోసిన సెట్టూసేమా పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా ఇనబడుతుందా కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో ఓ ఓఓ కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో ఓ ఓఓ కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల కారడవి తల్లీకి పుట్టానట్టేరో పుట్టానట్టేరో ఓ ఓఓ జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో ఓ ఓఓ కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో ఓ ఓఓ సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా సినికే రక్తము సూసి సెదిరి తోగాల గుబులేసి కన్నీరు వలికి తోగాల భూతల్లీ సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో ఓ ఓ కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో ఓ ఓఓ ఓఓ ఓ కాలువై పారే నీ గుండె నెత్తూరూ ఊఊఉ కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మా నుదుటి బొట్టవుతుంది సూడు అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో కొమురం భీముడో
This blog is frozen. No new comments or edits allowed.