Public · Protected · Private
జంధ్యాల
Type: Public  |  Created: 2026-01-14  |  Frozen: No
« Previous Public Blog Next Public Blog »
Comments

  •  🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల. నేడు జంధ్యాల గారి జన్మదిన జ్ఞాపకం ! Jan 14th


     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


    హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో, బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల ఆయనొక నవ్వులపంట .

    ......

    జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో వారిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.


     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿* ఒకే ఏడాది 80 చిత్రాలు రాసిన ఘనత.....


    జంధ్యాల రకరకాల ఇతివృత్తాలు తీసుకుని వ్రాశారు. అయితే ఎక్కువగా కామెడీ చిత్రాలకు వ్రాశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు కూడా ఎక్కువగా కామెడీలే. జంధ్యాల స్పీడ్ రైటర్, పది రోజుల్లో సినిమాకు మాటలు రాసేవారు. ఒక్కోసారైతే నాలుగైదు రోజుల్లోనే రాసేసేవారు. అలా ఓ ఏడాది అంటే 1983లో ఏకంగా 80 సినిమాలకు మాటలు రాశారు. తెలుగు సినిమా చరిత్రలో అది రికార్డు. జంధ్యాలకు అందుకు తగ్గట్టుగానే అవకాశాలు కూడా వచ్చాయి. ఆయన కళాత్మక చిత్రాలకు ఎంత హృద్యంగా రాశారో (ఉదాహరణకు శంకరాభరణం) హాస్య చిత్రాలకు అంత చిలిపిగా రాశారు. ఉదాహరణకు అహనా పెళ్లంట. జంధ్యాల చిత్రాల్లో సగటు మనిషి కనిపిస్తాడు.

    ......

    జంధ్యాల గారు 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మకర సంక్రాంతి రోజున జన్మించారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.

    ......

    1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసారు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు.


    * సినిమా ప్రస్థానం.....


    చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించారు జంధ్యాల. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ దృష్టిలో పడ్డారు. రచయతగా జంధ్యాల తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు.

    .....

    ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందారు.

    .....

    ఇటు ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు జంధ్యాల. మాటల రచయతగా ప్రారంభమైన జంధ్యాల సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తన సినిమాలు కుటుంబ సభ్యులు అందరు కూర్చోని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారు జంధ్యాల. డైరెక్టర్ గా ఆయన తొలి చిత్రం ‘ముద్ద మందారం’. తొలి చిత్రం తోనే సక్సెస్ అందుకున్నారు జంధ్యాల.

    ......

    ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాలది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు, వేలుని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తిజంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది.

    ......

    తెలుగు వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకుడు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోటతో బ్రహ్మానందాన్ని తిట్టించినా.. అది జంధ్యాలకు మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్ గా ఎదగడంలో జంధ్యాల పాత్ర మరిచిపోలేనిది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియోటర్లకు రప్పించడంలో జంధ్యాల ది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీ లక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాలకే సొంతం.

    ......

    క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ‘ఆనందభైరవి’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. హీరో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల కి ప్రత్యేక అనుబంధం ఉంది. కామెడీహీరోగా రాజేంద్రపసాద్ నిలదొక్కుకోవడానికి జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాలు కీ రోల్ పోషించాయి.

    .....

    జంధ్యాల ఒక్కో చిత్రం హాస్యపు ఆణిముత్యం. మెగాస్టార్ తో సైతం ‘చంటబ్బాయి’ గా చిత్ర విచిత్ర వేషాలు వేయించిన ఘనపాటి జంధ్యాల. ఈ సినిమాలో చిరంజీవిని జేమ్స్ పాండ్ గా మార్చి ప్రేక్షకులపై హాస్యపు జల్లులు కురిపించారు. అలాగే చిరంజీవిలో ఉన్న మంచి కామెడీ నటుడ్ని వెలికి తీసిన ఘనత కూడా హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది.

    .....

    ‘అహనా పెళ్లంట’, ‘ఒహోనా పెళ్లంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘జయమ్ము నిశ్మయమ్మురా’, ‘వివాహా భోజనంబు’…వంటి పాత తెలుగు సినిమాల్లోని పాటల పల్లవులు తన చిత్రాలకు టైటిల్స్ గా పెట్టి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఘనత కూడా జంధ్యాలదే. టైటిల్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేయడంలో జంధ్యాలకు సాటి మరెవరు లేరూ.

    ......

    దర్శకుడిగా కాకుండా నటుడిగా సైతం మెప్పించాడు జంధ్యాల. కళా తపస్వీ దర్శకత్వం వహించిన ‘ఆపద్భాందవుడు’లో అద్భుతాభినయాన్ని కనపరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటుడిగా, రచయతగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించి మెప్పించాడు జంధ్యాల. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సైతం మెప్పించారు.

    ......

    హీరో ఎవరైనా..నటీనటులు ఎవరైనా…తన మార్కు హాస్యం ఉండేలా జాగ్రత్త తీసుకునేవాడు జంధ్యాల. ఆయన ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉండేలా చూసుకునేవారు జంధ్యాల. తన సినిమాలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటిన దర్శకుడు జంధ్యాల.

    ......

    తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001 జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన మరణించినా తన చిత్రాలతో నేటికి హాస్యప్రియులను తన సినిమాలతో నవ్విస్తునే ఉన్నారు.

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

    * జంధ్యాల గారి చెణుకులు....


    1) ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. జంధ్యాల అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.


    2) హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం"


    * జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు....

    జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు.....


    1) బ్రహ్మానందం

    2) నరేష్

    3) ప్రదీప్

    4) సుత్తి వీరభద్రరావు

    5) సుత్తివేలు


    * జంధ్యాల వ్రాసిన కొన్ని గుర్తుండే సినీ సంభాషణలు......


    1) వివాహ భోజనంబు చిత్రం నుంచిమట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ-- (ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.


    2) వేటగాడు చిత్రం నుంచి


    రావు గోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా" అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు - " రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా ఫస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా ఫీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ" అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి - " ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు" అంటాడు.

    2026-01-14 18:46
  • రచయిత - ఆరుద్ర


    చిత్రం - పెళ్ళి పుస్తకం



    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా

    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా


    తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా

    తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా


    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

    సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా


    మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం


    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో

    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో


    అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో

    తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో


    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని

    ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని


    మసకేయని పున్నమిలా మనికినింపుకో


    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

    ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

    శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


    2026-02-19 12:42
  • అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి

    ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి

    అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి

    ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి

    అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ

    ఆ ఆ ఆ

    తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన

    శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ

    తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన

    శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ

    అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ

    ఆ ఆ ఆ

    చందమామా చందమామా కిందికి చూడమ్మా

    ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా

    వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా

    మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

    పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు

    పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు

    నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు

    ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు

    అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన

    ఆ ఆ ఆ ఆ ఆ

    అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన

    కలలకు దొరకని కళ కళ జంటను పదిమంది చూడంది

    తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి

    చందమామా చందమామా కిందికి చూడమ్మా

    ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా

    వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా

    మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

    సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా

    విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా

    గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా

    మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా

    దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా

    ఆ ఆ ఆ ఆ ఆ

    దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా

    అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి

    తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి

    చందమామా చందమామా కిందికి చూడమ్మా

    ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా

    వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా

    మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

    2026-02-19 12:45