Musings
Public · Protected · Private
చిట్టి చిలకమ్మా అమ్మ కోట్టిందా?
-
2008-02-10 02:36చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కున మింగావా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతిపూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే నా మాట వినవే నట్టింట బెట్టవే అన్నీ తెచ్చి మా అబ్బాయికి(అమ్మాయికి)య్యవే
-
2008-02-10 02:37చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టు దట్టి సందె దాయతులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్నా నిన్ను చేరి కొలతు కాకీ కాకీ కలుమల కాకీ కాకీ నీకు కడియాలిస్తే కడియాలెత్తి అమ్మకు ఇస్తే అమ్మ నాకు అటుకులు పెడితే అటుకులు ఎత్తి పంతులుకిస్తే పంతులు నాకు పాఠం చెబితే పాఠం మామకు చదివినిపిస్తే మామా నాకు పిల్లనిస్తే పిల్లా పేరు మల్లె మొగ్గ నా పేరు జమిందార్ ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా సన్నా బియ్యం ఛాయా పప్పు పాలు నెయ్యి, పాయసం పొయ్యి మినపా పప్పూ మెంతీ పిండీ తాటీ బెల్లం తవ్వెడు నెయ్యీ గుప్పెడు తింటే కులుకూలాడీ నడుమూ గట్టీ నా మాట బట్టీ ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా చెమ్మ చెక్క చారడేసి మొగ్గా అట్ట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా పందిట్లో మా బావ పెళ్ళి చేయంగా సుబ్బరాయుడి పెళ్ళి చుచి వద్దాం రండి మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి దొరగారింట్లో పెళ్ళి దోచుకు వద్దాం రండి
-
2008-02-10 02:37కాళ్ళా గజ్జా కంకాళమ్మా వేగుల చుక్కా వెలగా మొగ్గా మొగ్గా కాదు మోదుగ నీరు నీరూ కాదు నిమ్మల బావి బావీ కాదు వావింట కూర కూరా కాదు గుమ్మడి పండు ఫాండూ కాదూ పాపిడి మీసం పువ్వో మొగ్గో పుచ్చుకుంటే దెబ్బ కాలు దీసి కడగా పెట్టు కాళ్ళా గజ్జా కంకాళమ్మా గుడు గుడు గుంచెం గుండే రాగం పావడ పత్తెం పడిగే రాగం అప్పడల గుఱ్ఱం ఆడుకోబోతే పేపే గుఱ్ఱం పెళ్ళికి పోతే అన్నా అన్నా నీ పెళ్ళి ఎప్పుడు కత్తీ గాదు బద్దా కాదూ - గప్ చుప్ గుమ్మాడమ్మా గుమ్మాడి ఆకుల్లు వేసింది గుమ్మాడి పూవుల్లు పూసింది గుమ్మాడి పండ్లు పండిదమ్మా గుమ్మాడి అందులో ఒక పండు గుమ్మాడి అతి చక్కని పండు గుమ్మాడి ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి మా చిట్టి తల్లమ్మ (తండ్రమ్మ) గుమ్మాడి
-
2008-02-10 02:38ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు తారంగం తారంగం తాండవ కృష్నా తారంగం వేణూ నాధా తారంగం వేంకట రమణా తారంగం వెన్నెల దొంగా తారంగం చిన్ని కృష్నా తారంగం బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధీ వీధీ తిప్పేరు వీశడు గంధం పూశేరు చావెడు గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు ఊ ఊ ఉంగన్నా ఉగ్గు పాలు ఇందన్నా గరిటెడు ఉగ్గు కమ్మనా కక్కక ఉమ్మక మింగన్నా ఊ ఊ ఉంగన్నా ఉగ్గు పాలు ఇందన్నా లుంగలు పెట్టకు గుక్కన్నా ఓర్వని సవతుల దిష్టన్నా ఒప్పుగ మసలర బుచ్చన్నా దగుడు మూత దండాకోర్ పిల్లీ వచ్చే, ఎలుకా పోయె ఎక్కడి దొంగలక్కడె గప్ చుప్ బుజ్జి మేక బుజ్జి మేక ఎక్కడికెల్తివే? రాజు గారి తోట లోకి మేత కెల్తిని రాజు గారి తోటలోన ఏమి చేస్తివి? రాజు గారి తోటలోన పళ్ళు కోస్తిని కోసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కొట్టవస్తె పారి పోతిని with thanks to http://onamaalu.com
This blog is frozen. No new comments or edits allowed.