Musings
            Public · Protected · Private
        
        
    సీతారామకళ్యాణం sita rama kalyanam
    
    - 
                    2008-08-02 19:51సీతారాముల కళ్యాణం చూదము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !! చూచువారలకు చూడముచ్చటట.. పుణ్యపురుషులకు ధన్యభాగ్యమటా -2 భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. ఆ..ఆ..ఆ భక్తియుక్తులకు ముక్తిప్రదమటా.. సురులను, మునులను చూడవచ్చునట కళ్యాణం చూతము రారండి ! దుర్జనకోటిని దర్పమడంచగ.. సజ్జనకోటిని సం రక్షింపగా -2 ధారుణి శాంతిని స్థాపన చేయగా..ఆ..ఆ..ఆ ధారుణి శాంతిని స్థాపన చేయగా..న రుడై పుట్టిన పురుషోత్తమునీ.. కళ్యాణం చూదము రారండి ! దశరథరాజు సుతుడై వెలసీ.. కౌశికు యాగము రక్షణ చేసీ -2 జనకుని సభలో హరువిలు విరచీ..ఆ..ఆ..ఆ జనకుని సభలో హరువిలు విరచీ.. జానకి మనసు గెలిచిన రాముని.. కళ్యాణం చూతము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !! సీతారాముల కళ్యాణం చూదము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !! సిరికళ్యాణపు బొట్టును బెట్టీ..బొట్టును బెట్టీ మణిబాసికమును నుదుటను గట్టీ..నుదుటను గట్టీ పారాణిని పాదాలకు బెట్టీ..ఆ..ఆ..ఆ పారాణిని పాదాలకు బెట్టి.. పెళ్ళికూతురై వెలసిన సీతా.. కళ్యాణం చూతము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !! సంపగినూనెను కురులను దువ్వీ.. కురులను దువ్వీ సొంపుగ కస్తూరి నామము దీర్చి.. నామము దీర్చి చెంపగ వాసి చుక్కను బెట్టీ..ఆ..ఆ..ఆ చెంపగ వాసి చుక్కను బెట్టీ.. పెండ్లీ కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !! జానకి దోసిట కెంపుల ప్రోవై..కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాకై..నీలపు రాకై ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ..ఆ..ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా.. శిరముల మెరసిన సీతారాముల కళ్యాణం చూతము రారండి ! శ్రీసీతారాముల కళ్యాణం చూదము రారండి !!
 
This blog is frozen. No new comments or edits allowed.