Public · Protected · Private
సిరివెన్నెల irivennela
Type: Public  |  Created: 2008-01-09  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం

    ఓం!

    ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం

    ఓం!

    కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం

    ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

     

    సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది

    నే పాడిన జీవన గీతం ఈ గీతం

    విరించినై విరచించితిని ఈ కవనం

    విపంచినై వినిపించితిని ఈ గీతం

     

    ప్రాగ్దిశ వీణియపైన

    దినకర మయూఖ తంత్రులపైన

    ప్రాగ్దిశ వీణియపైన

    దినకర మయూఖ తంత్రులపైన

    జాగ్రుత విహంగ తతులే

    వినీల గగనపు వేదికపైన పలికిన

    కిల కిల స్వరముల స్వరజతి దొరకని జగతికి శ్రీకారము కాగా

    విశ్వ కావ్యమునకిది భాష్యముగా విరించినై||

     

    జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం

    చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం

     

    అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సౄష్టి విలాసములే

    విరించినై||

    నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం

    సరస స్వర సుర ఝరి గమనమౌ

    2008-01-09 00:27
  • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
    2008-01-11 17:00
  • ఆది భిక్షువు ఆదిభిక్షువు వాడినేది కోరేది?

    బూడిదిచ్చే వాడినేది అడిగేది? (2)

    ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)

    తీపిరాగాలా ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది? (2)

    కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది? ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)

    తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది? (2)

    బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది? ఏది కోరేది , వాడినేది అడిగేది? (2)

    గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది?

    వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది?

    ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు, వాడినేది కోరేది?

    ముక్కంటి, ముక్కోపి (2) తిక్కశంకరుడు!

     

    ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది? ఏది కోరేదీ, వాడినేది అడిగేది?

    2008-01-11 17:05
  • ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు - 2 ననుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు - 2 ఈ గాలి|| చిన్నారి గొరవంక .. కూసేను ఆ వంక .. నా రాక తెలిశాక ..వచ్చేను నా వంక -2 ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక -2 ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక -2 ఎగసేను నింగి దాక ఈ గాలి|| ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళలు -2 ఏ వలపుల తలపులతో చిలికాడో ఈ కళలు -2 ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను - 2 ఈ గాలి||
    2008-04-01 16:27
This blog is frozen. No new comments or edits allowed.