Musings
Public · Protected · Private
సుందరకాండ sundarakanda
-
2008-01-09 00:54ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలొనె రాలు పూవులెన్నో నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ విధి రాతకన్నా లేదు వింత పాట నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
This blog is frozen. No new comments or edits allowed.