Public · Protected · Private
ఏవి తల్లీ! శ్రీ శ్రీ
Type: Public  |  Created: 2009-01-23  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • చక్రవర్తిఅశోకుడెచ్చట ? జగద్గురు శంకరుడెచ్చట ? ఏవితల్లీ: నిరుడు కురిసిన హిమ సమూహములు ? కాళిదాసు మహా కవీంద్రుని కవనవాహినిలో కరంగిన ఉజ్జయినినేడెక్కడమ్మా ఉంది? చూపించు ? షాజహాన్‌ అంత:పురములో షట్పదీశింజానమెక్కడ: ఝాన్సీ లక్ష్మీదేవియెక్కిన సైంధవంనేడేదితల్లీ ? రుద్రమాంబా భద్రకాళీ లోచనోజ్జల రోచులేవీ.: ఖడ్గతిక్కన కదనకాహళ కహకహ ధను లెక్కడమ్మా? ఎక్కడమ్మాకృష్ణరాయని బాహు జాగ్ర ద్బాడబాగ్నులు ? బాలచంద్రునిబ్రహ్మనాయని ప్రాణవాయువులేవితల్లీ ? జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీశులు, సైన్యనాధులు, ఆనవతులగు మహారాజ్ఞులు కానరారేమీ ? పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయినజాడలేవీ ? ఏవితల్లీ: నిరుడు కురిచిన హిమ సమూహములు ?
    2009-01-23 23:10
This blog is frozen. No new comments or edits allowed.