Public · Protected · Private
మా తెలుగు తల్లికి
Type: Public  |  Created: 2009-11-12  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • మా తెలుగు తల్లికి మల్లె పూ దండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూ దండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో శిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూ దండ గలగలా గోదారి కదలి పోతుంటేను గలగలా గోదారి కదలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూ దండ అమరావతీ గుహల అపురూప శిల్పాలు అమరావతీ గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక నీ పాటలే పాడుతాం,నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి
    2009-11-12 00:08
This blog is frozen. No new comments or edits allowed.