Public · Protected · Private
తెలుగు అక్షరాలు
Type: Public  |  Created: 2010-08-22  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • తెలుగు భాషకు అక్షరములు 56. 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న = 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ. దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ. ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ. హల్లులు 37 . క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప. సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ. స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష. స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి. క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ త వర్గము - త, థ, ద, ధ, న మ వర్గము - ప, ఫ, బ, భ, మ
    2010-08-22 00:20
  • ఉభయాక్షరములు ఇవి 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు. సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు కలవు. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న ను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు. సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు. సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు. అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు. విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము. [మార్చు] ఉత్పత్తి స్థానములు కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, ఓ, ఔ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ. తాలవ్యములు : దౌడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ. మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర. దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - చ, జ, త, థ, ద, ధ, న, ర, ల, స. ఓష్ఠ్యములు : పెదవుల నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. నాసిక్యములు : నాసిక నుండి పుట్టినవి - జ్ఞ, ఙ, ఞ, ణ, న, మ. కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ. కంఠ్యోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ. దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.
    2010-08-22 00:20
This blog is frozen. No new comments or edits allowed.