Musings
Public · Protected · Private
అన్నమయ్య annamayya
-
2008-01-11 19:20నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య నోపకరా నన్ను నొడబరపుచు పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా చికాకు పడిన నా చిత్త శాంతము సేయ లేకకా నీవు బహులీలనన్ను కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ నవనీత చోర శ్రీ నారాయణా
-
2008-01-11 19:26Good annamayya collections at http://dvnsravan.wordpress.com/
-
2008-02-17 18:56వినరో భాగ్యము విష్ణు కధ వెనుబలమిదివో విష్ణు కధ వినరో భాగ్యము విష్ణు కధ వెనుబలమిదివో విష్ణు కధ వినరో భాగ్యము విష్ణు కధ చేరియశోదకు శిశువితడు దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరియశోదకు శిశువితడు దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరియశోదకు శిశువితడు అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేలుమంగ ఏమని పొగడుదుమే వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రివెంకటాధ్రి నాధుడే వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటెశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామ.. యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా యేడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా ఇందరికి అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి
-
2008-12-26 12:32అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక -2 భారపు పగ్గాలు పాపపుణ్యములు -2 నేరుపున బోవు నీవు వద్దనక అంతర్యామి || మదిలో చింతలు మయలలు మణుగులు వదలవు నీవవి వద్దనక -2 ఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభో ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీవదె అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి ||
This blog is frozen. No new comments or edits allowed.