Geethanjali గీతాంజలి

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


ఏల గాలి మేడలు రాలు పూల దండలు


నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు


నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె


నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే


ఓ ప్రియా ప్రియా నిప్పులోన కాలదు


నీటిలోన నానదు గాలి లాగ మారదు


ప్రేమ సత్యము


రాచవీటి కన్నెవి


రంగు రంగు స్వప్నము


పేదవాడి కంటిలో ప్రేమ రక్తము


గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో


జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో


ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు


రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు


సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ


ఓ ప్రియా ప్రియా


కాళిదాసు గీతికి కృఇష్ణ రాసలీలకి


ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి


ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి


పేదవాడి ప్రేమకి చావు పల్లకి


నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని


కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే


వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా


పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా


జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా


కాలమన్న ప్రేయసి


తీర్చమంది నీ కసి


నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన


లేదు శాసనం లేదు బంధనం


ప్రేమకే జయం ప్రేమదే జయం

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన తీయగ
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన
ఓ పాప లాలి

నా జోలల లీలగ తాకాలని
గాలినే కోరన జాలిగ
నీ సవ్వడే సన్నగ ఉండాలని
కోరన గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వల్చిన వోడిలో
తడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి

ఓ పాప లాలి

ఓ మేఘమ ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిల పాడవే నా పాటని
తీయని తేనెలే చల్లిపో
ఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలో
సెలయేరున అల పాటే వినిపించని గదిలో
చలి యెండకు సిరివెన్నలకిది నా మనవి
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
మాయదేవుడే మొగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికొసమో