పంచరత్న కృతులు

 ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥

చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥ఎందరో॥

సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా
॥ఎందరో॥

సరగుస బాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా

॥ఎందరో॥

పతితపావనుడనే పరాత్పరుని గురించి
బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా
॥ఎందరో॥

హరి గుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో
గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా
॥ఎందరో॥

హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా
॥ఎందరో॥

పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా
॥ఎందరో॥

పరమభాగవత మౌనివరశశివిభాకర సనకనందన దిగీస
సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవనసూను
బాలచంద్రధర శుకసరోజభవ భూసురవరులు పరమపావనులు
ఘనులు శాశ్వతులు కమలభవసుఖము సదాసుభవులుగాక
॥ఎందరో॥

నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మా
నసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు
జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సతతంబునను గుణభవనానంద కీర్తనము జేయువా
॥ఎందరో॥

భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూడముల ముప్పదిముక్కోటి సురాంత
రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే
జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా
॥ఎందరో॥

ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ
॥ఎందరో॥