లవకుశ lavakusa

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


జగదభి రాముడు శ్రీరాముడే


వల్లనోరి మావా నీ పిల్లని, నేనొల్లనోరి మావా నీ పిల్లని

సందేహించముమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా

జయము జయము

వినుడు వినుడు రామాయణ గాధా

రామకధను వినరయ్యా ఇహ పర సుఖములనొసగే సీతా రామ కథను వినరయ్యా.

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడ విదేమమ్మ.

రామ సుగుణధామ రఘువంశ జలధి సోమా సీతా మనోభిరామా సాకేత సార్వభౌమ.

శ్రీ రాఘవమ్ రఘుకులాన్వయ రత్న దీపమ్(పద్యము)

శ్రీరాముని చరితమును వినుడోయమ్మా ఘన శీలవతీ సీత కధ వినుడోయమ్మా.
రామ సుగుణధామా రఘువంశ జలధిసోమా
శ్రీరామ సుగుణధామా సీతా మనోభిరామా సాకేత సార్వభౌమా
శ్రీరామ సుగుణధామా ||

మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత రామా
మందార మరందోపమ మధుర మధుర నామా
మందార మరందోపమ మధుర మధుర నామా

శ్రీరామ సుగుణధామా రఘువంశజలధి సోమా
శ్రీరామ సుగుణధామా||

అవతార పురుష రావణాది దైత్యవి రామా
నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీరామ సుగుణధామా ||
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
వినుడు వినుడు ||
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా
వినుడు వినుడు ||

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
పౌరులెల్ల ||

కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని . మంథర మాట విని .

వినుడు వినుడు ||


అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని .కూలే భువి పైని

వినుడు వినుడు ||

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాల వ్రాలి

ఓ .. ఆ ..
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా.
వెడలినాడు రాఘవుడు||
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకొన్నది
అడుగులబడి రాఘవా .
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది .

అడలి అడలి కన్నీరై అరయుచున్నది ...
వినుడు వినుడు ||