అత్తలేని కోడలుత్తమురాలు

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా


కోడలు లేని అత్త గుణవంతురాలు


ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ.. అత్త||


కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా


పచ్చిపాలమీద మీగడేదమ్మా ..


ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా


ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ


అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా


పచ్చిపాలమీద మీగడుంటుందా ..


ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా


ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్త||


వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా


మినప సున్నుండలేమాయే కోడలా …


ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ


ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారె అత్తమ్మా


వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మా …


ఛీ పో… నీ జిమ్మడా…. ఉండు నీ పని చెబుతా…


కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ


పొమ్మని కాలంతా కుట్టిందీ తేలు


అయ్యో.. అబ్బా … అమ్మా … అయ్యో ఆ…


ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది ఆ…


ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది


ఆహ.. ఊహూ అత్త||


ఆహ.. ఊహూ .. అహ …