సుఖదుఃఖాలు sukha dukhalu
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ
విందులు చేసింది
కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది-2
చిరిగిన రెక్కల వొరిగింది
నేలకు వొరిగింది ..
ఇది మల్లెల వేళయనీ ||
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు
వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ||
ద్వారానికి తారా మణి హారం..
హారతి వెన్నెల కర్పూరం -2
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ ||