కొన్ని పధ్యాలు

గురు భ్రహ్మ గురుర్విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరభ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

శుక్లాం భరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయే
సర్వ విఘ్నోపశాంతయే||
అగజానన పద్మార్కం
గజాననమహర్నిశమ్
అనేకదం తమ్ భక్తానాం
ఏకదంతముపాస్మహే.


ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందుపరమేశ్వరు డెవ్వడుమూలకారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
పద్మ పత్ర విశాలాక్షీ పద్మ కేసర వర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ