మాస్టర్ master
ప్రభాతమా.. శుభ వసంతమా ..
నే మోయ లే నంటూ.. హృదయాన్ని అందించా ..
నేనున్నాలెమ్మంటూ.. అది నాలో దాచేసా ..
ఏ దారిలో సాగుతున్నా..యద నీవైపుకే లాగుతోంది ..
ఏ వేళలో ఎప్పుడైనా.. మది నీ వూహలో వూగుతోంది
తిలోత్తమా||
పెదవే... ఓ మధుర కవిత చదివే ..
అడుగే ... నా గడపనొదిలి కదిలే ..
ఇన్నాళ్ళు లేని ..ఈ కొత్త బాణి...
ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా..
ఈ మాయ చేసింది ప్రేమే ...
ప్రియా.. ప్రేమంటే ఒకటైన మనమే..
తిలోత్తమా||
కలలే.. నా ఎదుట నిలిచె నిజమై...
వలపే... నా ఒడికి దొరికె వరమై ...
ఏ రాహువైన.. ఆషాఢమైన...
ఈ బాహు బంధాన్ని విడ దీయునా ...
నీ మాటలె వేద మంత్రం.. చెలీ.. నువ్వన్నదేనా ప్రపంచం
తిలోత్తమా||