సీతాకోకచిలుక seetakokachiluka

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుఃషేవేంద్రియే ప్రతి తిష్టతి

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం-2


నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రము మనసే బంధము-2

నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎద నా కోవెలా ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రము -2
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా-2
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ ||


చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాల
చుక్క నవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాల
బుగ్గ దాచుకుంటే బులపాటాల
దప్పికంటే తీర్చటానికిన్ని తంటాల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ ||

ఓ రామచిలుక చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మ ఈడు ఏమందమ్మ
ఈడుకున్న గోడు నువ్వే గోరింక
తోడుగుండిపోవే కంటినీరింక
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక

మిన్నేటి సూరీడు లలలల మిన్నేటి సూరీడు లలలలలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ ||