నిరీక్షణ nirikshana

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది-2
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది-2

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ-2

ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై..
స్వప్నాలే..స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది-2

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై. సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది-2
జాబిల్లి కోసం ఆకాశమల్లే!
వేచాను నీ రాకకై!(2)
నిను కాన లేక!మనసూరుకోక!
పాడాను నేను పాటనై!

జాబిల్లి కోసం ఆకాశమల్లే!||

నువ్వక్కడ నేనిక్క్డడ!
పాటిక్కడ పలుకక్కడ!
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా!(2)

ఈ పువ్వులనే నీ నవ్వులుగా!
ఈ చుక్కలనే నీ కన్నులుగా!
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా!
ఊహల్లొ తేలి ఉర్రూతలూగి!
మేఘాల తోటి రాగాల లేఖ!
నే పంపినాను!రావా దేవి!

జాబిల్లి కోసం ఆకాశమల్లే!||

నీ పేరొక జపమైనది!
నీ ప్రేమొక తపమైనది!
నీ ధ్యానమై వరమైనది ఎన్నాల్లైనా!(2)
ఉండి లేక వున్నది నీవే!
ఉన్నాకూడా లేనిది నేనే!
నా రేపటి అడియాశల రూపం నీవే!
దూరాన వున్నా నా తొడు నీవే!
నీ దగ్గరున్నా నీ నీడ నాదే!
నాదన్నదంతా నీవే నీవే!

జాబిల్లి కోసం ఆకాశమల్లే! ||
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచానే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే వెతికానే -2

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే ||



తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం

చుక్కల్లే తోచావే ||