pelli kanuka
అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం
మనసునే మరపించు
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం
జీవ మొసగును గానం
మది చింత బాపును గానం
వాడిపోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపోయిన తీగయైనా
కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు
దోర వలపే కురియు
మది దోచుకొమ్మనీ తెలుపు .
పులకించని||