kids songs

ఒప్పులకుప్పా, ఒయ్యారిభామ, సన్నబియ్యం, చాయపప్పు,
చిన్నమువ్వ, సన్నగాజు, కొబ్బరికోరు, బెల్లపచ్చు,
గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి రోట్లో తవుడు,
నీ మొగుడెవడు ?
గుడుగుడుకుంచం గుండేరాగం పావడపట్టం పడిగేరాగం
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే పేపేగుఱ్ఱం పెళ్ళికిపోతే
అన్నా ! అన్నా! నీపెళ్ళెపుడంటే రేపుగాక, ఎల్లుండి.
కత్తీగాదు, బద్దాగాదు, గప్, చిప్


చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు,
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ,నీకు కరకంచుచీర,
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ,
మామచెప్పినపనీ మానకే బొమ్మ,
రావాకుచిలకమ్మ ఆడవే పాప,
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు.
చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు,
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ,నీకు కరకంచుచీర,
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ,
మామచెప్పినపనీ మానకే బొమ్మ,
రావాకుచిలకమ్మ ఆడవే పాప,
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు.