మల్లె మొగ్గలు malle moggalu

ఏరు పక్క మా ఊరమ్మా ఊరు పక్క మాగాణమ్మా
ఏరు కాళింది ఊరు రేపల్లె
వేణువందుకే మోగిందమ్మా వెన్నదాచకే కన్నె గోపెమ్మా
ఏరు పక్క ...

మువ్వ గోపాలా రారా అంటు మువ్వ మువ్వకి పిలుపేనమ్మా
ముద్దు గోవిందా రారమ్మంటు ముగ్గు ముగ్గున కవితేనమ్మా
జారు పైటలా జావళి వింటే జాను తెనుగులే పండేనమ్మా
ఏరు పక్క ..

సువ్వి గోపాలా సువ్వి అంటూ పాలపొంగులే పలికేనమ్మా
గుమ్మడెక్కడే గుమ్మా అంటూ చల్ల చిందులే సణిగేనమ్మా
కొమ్మ కొమ్మకీ కొత్త పల్లవి కోకిలమ్మలే పాడేనమ్మా
ఏరు పక్క ..